కలెక్షన్లలో 'దంగల్‌'ని క్రాస్ చేసిన సల్లూ భాయ్ 'బీబీ' సినిమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలెక్షన్లలో 'దంగల్‌'ని క్రాస్ చేసిన సల్లూ భాయ్ 'బీబీ' సినిమా

  • 'భజరంగీ భాయ్‌జాన్' తొలి రోజు కలెక్షన్లు 18 కోట్లు
  • అమీర్ 'సీక్రెట్ సూపర్‌స్టార్‌' కంటే తక్కువే
  • చైనాలో విడుదలయిన సల్మాన్ తొలి చిత్రమిదే
బాలీవుడ్‌లో ఖాన్‌ల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటోంది. సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన 'దంగల్' చిత్రం ఇటు ఇండియాలోనే కాక అటు చైనాలోనూ దూసుకుపోతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. చైనా బాక్సాఫీసు అందించిన సమాచారం ప్రకారం, అక్కడ అమీర్ 'దంగల్' చిత్రం సాధించిన తొలి రోజు కలెక్షన్లను సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్‌జాన్' చిత్రం క్రాస్ చేసేసింది. ఈ సినిమా మనదేశంలో రిలీజయిన రెండేళ్ల తర్వాత అక్కడ గత శుక్రవారం విడుదలయింది.

ఈ సినిమా తొలి రోజు అక్కడ ఏకంగా రూ.18 కోట్ల వసూళ్లను రాబట్టింది. అక్కడ విడుదలయిన మొట్టమొదటి సల్మాన్ చిత్రం ఇదే. శనివారం మధ్యాహ్నానికి ఈ చిత్రం రూ.25 కోట్ల మార్కును దాటేసింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి చక్కటి స్పందన వస్తోంది. ఈ సినిమా 'దంగల్' కలెక్షన్లను బీట్ చేసినప్పటికీ, చైనాలో చివరగా విడుదలయిన అమీర్‌ఖాన్ మరో సూపర్‌హిట్ సినిమా 'సీక్రెట్ సూపర్‌ స్టార్' కలెక్షన్లను మాత్రం అందుకోలేకపోయింది.

'సీక్రెట్ సూపర్‌స్టార్' చైనాలో విడుదలయిన తొలి రోజు ఏకంగా రూ.40 కోట్లను వసూలు చేసింది. అక్కడ దంగల్ మొత్తంగా రూ.1000 కోట్లను వసూలు చేసింది. సీక్రెట్ సూపర్‌స్టార్ రూ.750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.
China
Dangal
Aamir Khan
Salman
Bajrangi Bhaijaan

More Telugu News