Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తక్కువ ధరకే లావా ఆండ్రాయిడ్ గో వెర్షన్ మొబైల్!

  • జెడ్50 ఫోన్ ఆవిష్కరణ
  • ఈ నెల నుంచే అమ్మకాలు
  • 4.5 అంగుళాల 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్
దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా ఆండ్రాయిడ్ గో వెర్షన్ పై తొలి స్మార్ట్ ఫోన్ జెడ్50 ని ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ గో అన్నది తక్కువ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లలో పనితీరు వేగంగా ఉండేందుకు రూపొందించినది. లావా జెడ్50 ఫోన్ దేశవ్యాప్తంగా లక్ష అవుట్ లెట్లలో ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. అయితే నిర్ణీత ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కాకపోతే తక్కువే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఎయిర్ టెల్ మేరా పెహలా స్మార్ట్ ఫోన్ కింద ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన ఎయిర్ టెల్ కస్టమర్లు రూ.2,000 మేర క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.

లావా జెడ్50లో 4.5 ఎఫ్ డబ్ల్యూవీజీఏ స్క్రీన్, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ రామ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్ పాండబుల్, 10 ప్రాంతీయ భాషల అందుబాటు, ముందు, వెనుక 5 మెగా పిక్సల్స్ కెమెరా, ఫ్లాష్, బోకే మోడ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
lava mobiles
android go

More Telugu News