ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్.. ఏకపక్షంగా కాల్పులు జరిపారు: మావో నేత జగన్
- కార్పొరేట్ శక్తులను కాపాడేందుకే ఎన్ కౌంటర్
- ముందు రోజు రాత్రే పోలీసులు చుట్టుముట్టారు
- కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో కాల్పులు జరిపారు
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మరణించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇందులో వాస్తవం లేదని జగన్ చెప్పారు. హరిభూషణ్, రాజిరెడ్డి, దామోదర్ అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారిలో కాజీపేట మండలం రాంపేట్ కు చెందిన దూడబోయిన స్వామి అలియాస్ సుధాకర్, బీజాపూర్ కు చెందిన రత్న ఉన్నారని... మిగిలినవారంతా చత్తీస్ ఘడ్ కు చెందినవారని చెప్పారు.