శ్రీదేవి తన చెల్లెలికే కాదు .. మాకూ సాయం చేసింది: బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి

  • శ్రీదేవికి, చెల్లెలికి మధ్య చిన్న వాదన జరిగింది 
  • అవి ఆస్తి తాలూకు గొడవలు కావు 
  • చెల్లెలికి శ్రీదేవి ఎప్పుడూ సాయపడుతూనే వచ్చింది  
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి .. ఆమెకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. " శ్రీదేవి తల్లి చనిపోయిన తరువాత ఒక కారణంగా శ్రీదేవికి .. చెల్లెలికి మనస్పర్థలు వచ్చాయి. కానీ అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించాం. అంతే తప్ప ఆస్తి సంబంధమైన గొడవలు వాళ్లిద్దరి మధ్య లేవు.

శ్రీదేవి అంతకుముందు తన చెల్లెలికి సాయం చేసింది .. అలాగే మనస్పర్థలు తొలగిన తరువాత కూడా చెల్లెలికి కావలసినవి ఏర్పాటు చేసింది. ఇక మేం ఇల్లు కట్టుకుంటున్నాం అని తెలిసి, చెన్నై నుంచి ఏసీ మెషీన్లు .. మార్బుల్స్ పంపించింది. అలా మాకు కూడా ఆమె అడక్కుండానే సాయం చేసింది" అని చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
sridevi
venugopal reddy

More Telugu News