రూ. 30 లక్షల రివార్డున్న హరిభూషణ్, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావులు మరణించారు: పోలీసుల అధికారిక ప్రకటన
- తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
- 10 మంది మరణించారని పోలీసుల ప్రకటన
- తీవ్రంగా గాయపడ్డ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్
- న్యాయవిచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్
ఇక ఈ ఎన్ కౌంటర్ లో తాము పోలీస్ కమాండర్ సుశీల్ ను పోగొట్టుకున్నామని తెలిపారు.
ఇదిలావుండగా, ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఈ మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హరిభూషణ్ ను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2016 మార్చి 2న పట్టుకున్న పోలీసులు, రెండేళ్ల పాటు రహస్య ప్రాంతంలో విచారించి, నేడు హతుడైనట్టు ప్రకటించారని విప్లవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.