ఇవన్నీ ధరించడం నాకో సెంటిమెంట్.. ఇవే నన్ను కాపాడుతున్నాయి!: కోడి రామకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవన్నీ ధరించడం నాకో సెంటిమెంట్.. ఇవే నన్ను కాపాడుతున్నాయి!: కోడి రామకృష్ణ

  • నా కారు పెద్ద ప్రమాదానికి గురైంది 
  • అయినా నాకేమీ కాలేదు 
  • భక్తి విశ్వాసాలే అందుకు కారణం
కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ సిద్ధహస్తులు. ఎంతోమంది అగ్ర కథానాయకులతో ఆయన సినిమాలు చేశారు. ఆయన ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వున్నాయి. అలాంటి ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. ఆయన ఎప్పుడు చూసినా నుదుటున ఎర్రటి బొట్టుపెట్టుకుని ఉండటం .. అన్ని వ్రేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం .. ముంజేతికి రకరకాల కంకణాలు కట్టుకోవడం గురించిన ప్రస్తావన వచ్చింది.

అప్పుడాయన స్పందిస్తూ .. "ఇవన్నీ ధరించడం నాకో సెంటిమెంట్ .. దిష్టి పోతుందనే ఒక నమ్మకం .. ఆపదల నుంచి కాపాడతాయనే విశ్వాసం. ప్రమాదం జరక్కుండా ఇవి ఆపలేవు .. జరిగినప్పుడు మాత్రం కాపాడతాయి. నేను తిరుపతిలో షూటింగ్ చేయడానికి వెళుతూ ఉండగా పెద్ద ప్రమాదం జరిగింది. అయినా అదేమీ నాకు తెలియదు.. కళ్లు తెరిచి చూస్తే చుట్టూ విపరీతమైన జనం. అప్పుడు చూసుకుంటే నేను రోడ్డు పక్కన పడివున్నాను. కారు ముక్కముక్కలైపోయి కనిపించింది. డ్రైవర్ చనిపోయాడు .. ఫ్రెండ్స్ అంతా పడిపోయివున్నారు. కారును చూసిన వాళ్లంతా నేను పోయాననే అనుకున్నారు. అలా నా భక్తి విశ్వాసాలు .. నా తల్లిదండ్రులు చేసిన పూజలు నన్ను కాపాడుతూ వుంటాయని నేను నమ్ముతుంటాను" అని చెప్పుకొచ్చారు.        





kodi ramakrishna

More Telugu News