శ్రీదేవి మృతి పట్ల కన్నీరుమున్నీరైన రాఖీ సావంత్... కామెడీ వద్దంటూ నెటిజన్ల ఎద్దేవా!
- శ్రీదేవి మృతితో తల్లడిల్లిన అభిమానులు
- బాధతో రాఖీ సావంత్ పోస్టులు
- ఆమె పోస్టులపై నెటిజన్ల ఎద్దేవా
‘శ్రీదేవిజీ! మీరు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. ఐ లవ్యూ సోమచ్. ఏమైంది మీకు? ఎందుకు వెళ్లిపోయారు? మీలా ఎవరూ నటించలేరు, డాన్స్ చేయలేరు. మీరు చాలా మంచి వారు. మీరు లేకపోవడంతో నాకూ బతకాలని లేదు’ అంటూ బాధతో కూడిన పోస్టును పెట్టింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. 'రాఖీ, కామెడీ చేయకు' అంటూ కొందరు సూచించారు. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారికి చెందిన ఓ పాత వీడియోను పోస్టు చేసిన ఆమె...శ్రీదేవి మళ్లీ పుట్టారని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పింది.