అందులో నిజంలేదు గానీ .. నాకు కాస్త పొగరుంది: యాంకర్ రవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందులో నిజంలేదు గానీ .. నాకు కాస్త పొగరుంది: యాంకర్ రవి

  • అభిమాన తారలు చిరూ .. ఇలియానా 
  • ఇష్టమైన యాంకర్స్ ప్రదీప్ - శ్రీముఖి 
  • నాకు కాస్త పొగరుంది
 యాంకర్ గా రవి బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే సినిమాల్లోను మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన ఇష్టాయిష్టాలను పంచుకున్నాడు. హీరో హీరోయిన్స్ లో తనకి చిరంజీవి ... ఇలియానా అంటే ఇష్టమనీ, ఇక యాంకర్స్ లో ప్రదీప్ .. శ్రీముఖి అంటే ఇష్టమని చెప్పాడు.

ఒకవేళ తాను ఈ ఫీల్డ్ లోకి రాకపోయిగనుక ఉంటే క్రికెటర్ ను అయ్యేవాడినని అన్నాడు. లాస్య తో యాంకరింగ్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పాడు. తనకి కాస్త పొగరు అనే మాట నిజమేనని ఆయన ఒప్పుకున్నాడు. ఇక సినిమాల్లో తన యాటిట్యూడ్ కారణంగానే అవకాశాలు రావడం లేదనే విషయాన్ని ఆయన సున్నితంగానే ఖండించాడు. తన మేనేజర్ కథలు వింటున్నాడనీ .. ఆయనకి మంచిగా అనిపిస్తే అప్పుడు నా వరకూ తీసుకొస్తాడని  సమాధానమిచ్చాడు.         
ravi

More Telugu News