బుమ్రా.. అతిగా ఆడకు... జాగ్రత్త తీసుకో: చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

  • బుమ్రాపై పనిభారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి
  • కీలకమైన సిరీస్ లు ముందున్నాయి
  • బుమ్రా గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
టీమిండియ్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా మంచి ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా టూర్ లో మంచి ప్రతిభను కనబరచి, జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ సిరీస్ లో బుమ్రా ఏకంగా 162.1 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో, మూడు టెస్టుల్లో 112.1 ఓవర్లు వేశాడు.

ఈ సందర్భంగా బుమ్రాకు జాతీయ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక సూచన చేశాడు. బుమ్రా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడిన ప్రసాద్... భవిష్యత్తులో చాలా కీలక పర్యటనలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం ఎక్కువ కాకుండా చూసుకోవాలని అన్నాడు. అతను ఎక్కువగా ఆడకుండా చూసుకోవాలని అన్నాడు. బుమ్రా బౌలింగ్ స్టైల్ విభిన్నంగా ఉంటుందని... ఈ నేపథ్యంలో, అతనికి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ముఖ్యమైన సిరీస్ లలో మాత్రమే బుమ్రాను ఆడించాలని అన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని బుమ్రాకు సూచించాడు.  
Go Back to Shorts
bumrah
msk prasad
team india

More Telugu News