Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరికీ అన్ హ్యాపీ హోలీ: రాంగోపాల్ వర్మ

  • శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్న వర్మ
  • హోలీ ఎలా చేసుకోవాలి?
  • ఆనందం లేని హోలీ అంటూ వ్యాఖ్య
అందాల తార శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, తన ఫేస్ బుక్ ఖాతాలో మరో పోస్టు పెట్టాడు. ఈ హోలీ ఆనందకరమైనది కాదంటూ, "అందరికీ అన్ హ్యాపీ హోలీ" అని వ్యాఖ్యానించాడు. దేవుడు శ్రీదేవిని చంపిన వైనాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని, ఈ హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకోగలనని అన్నాడు.

అంతకుముందు తన ఇన్ స్టాగ్రామ్ లో శ్రీదేవి అంతిమయాత్రకు హాజరైన అభిమానుల చిత్రాన్ని ఉంచుతూ, సముద్రమంత ప్రేమను కురిపిస్తున్న అభిమానుల కోసమైనా దేవుడు తన మనసును మార్చుకుని ఆమెను వెనక్కు పంపాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. దానికన్నా ముందు, 'భవిష్యత్తు నుంచి ఓ నిజం' అంటూ స్వర్గం నుంచి శ్రీదేవి అనే పేరున్న యువతి భూమ్మీదకు వచ్చి 1963 నుంచి 2018 వరకూ మనతో ఉండి, ఇక్కడ బోర్ కొట్టి, తిరిగి తన ఇంటికి వెళ్లిపోయిందని చెప్పాడు.
Sridevi
Holi
Ramgopal Varma
Facebook

More Telugu News