పోస్టల్ కవర్‌ను తెరిచి అస్వస్థతకు గురైన 11 మంది అమెరికా మిలటరీ సిబ్బంది.. ఉగ్ర చర్యేనా?
- అమెరికా మిలటరీ బేస్‌లో ఘటన
- ఉగ్రచర్యపై ఇప్పుడే చెప్పలేమంటున్న అధికారులు
- కొనసాగుతున్న దర్యాప్తు
వారిని ఆసుపత్రికి తరలించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కవర్ విప్పి చూసిన వారు చేతులు, ముఖం కాలిన అనుభవానికి లోనయ్యారని ‘సీఎన్ఎన్’ పేర్కొంది. ఈ ఘటనను ఉగ్రచర్యగా చెప్పడం తొందరపాటు చర్యే అవుతుందని నావికాదళ అధికార ప్రతినిధి మేజర్ బ్రెయిన్ బ్లాక్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.