cpi: రాజకీయ ప్రక్షాళన జరగాలంటే వామపక్ష నేతలతో పవన్ కల్యాణ్ కలవాలి: సీపీఐ నేత రామకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
రాజకీయ ప్రక్షాళన జరగాలంటే వామపక్ష నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలవాలని ఏపీ సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సాధనకు నిమిత్తం విశాఖపట్టణంలో వామపక్షాలు మహాధర్నా నిర్వహించాయి. ఈ మహాధర్నాలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో పనిచేయాలని, అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు.

చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు మాత్రమే పరిమితమైందని, విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 5న ఢిల్లీ వెళ్లి ఏపీకి ప్రత్యేకహోదాపై తేల్చుకుంటామని అన్నారు. కాగా, మహాధర్నాలో పాల్గొన్న సీపీఎం నేత రాఘవులు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, విభజన హామీలు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని అన్నారు.
Go Back to Shorts
cpi
ramakrishna
Vizag

More Telugu News