Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రి గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాను: కీర్తి సురేశ్

  • సావిత్రి గారి సినిమాలు చూశాను 
  • ఆమె గురించిన పుస్తకాలను చదివాను 
  • ఓ అవగాహనకి వచ్చాకే ఓకే చెప్పాను
సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా 'మహానటి' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ .. 'ఈ సినిమాలోని పాత్రను నేను మిగతా పాత్రల మాదిరిగా భావించలేదు. సావిత్రి గారికి సంబంధించిన చాలా సినిమాలను చూశాను .. ఆమె హావభావాలను పరిశీలించాను. సావిత్రి గారి గురించిన పుస్తకాలను చదివి ఆమె వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాను.

ఇక సావిత్రిగారి కూతురైన చాముండేశ్వరిని కూడా కలుసుకుని మరికొన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకున్నాను. ముఖ్యంగా సావిత్రిగారి బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాను. ఈ పాత్రలో ఒదిగి పోవడానికి ఈ విషయాలు నాకెంతో హెల్ప్ అయ్యాయి' అంటూ చెప్పుకొచ్చింది. తనపై వస్తోన్న కామెంట్లకి సమాధానంగానే కీర్తి సురేశ్ ఇలా చెప్పుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.   
keerthi suresh

More Telugu News