Sridevi: శ్రీదేవికి ఇష్టమైన తెల్లపూలతోనే.. అంతిమ యాత్రలో వాహనానికి అలంకారం

శ్రీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. అందుకే, ఆమె అంతిమ యాత్రకు సంబంధించి అంతా తెలుపు రంగులో ఉండేలా చూశారు. అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం మొత్తం పలు రకాల తెల్లపూలతో అలంకరించారు. అందులో పెట్టిన శ్రీదేవి చిత్రపటం చుట్టూ కూడా తెల్లపూల దండలను ఉంచారు.
   
ప్రస్తుతం శ్రీదేవి అంతిమ యాత్ర ముంబయిలోని విల్లే పార్లే శ్మశానవాటిక దిశగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అతిలోక సుందరి ఇకలేదన్న విషాదాన్ని భారతీయ సినీ పరిశ్రమ, ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.      


   
Sridevi
funeral ceremony
mumbai

More Telugu News