రైల్వేలో ఉద్యోగ జాతర... 89,500 మంది నియామకానికి సన్నాహాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైల్వేలో ఉద్యోగ జాతర... 89,500 మంది నియామకానికి సన్నాహాలు!

  • లోకో పైలట్లు, టెక్నీషియన్లు, గ్యాంగుమెన్ల భర్తీ
  • ఏటా 40,000 మంది పదవీ విరమణ
  • భద్రతా విభాగంలోనే భారీగా ఖాళీలు
  • తాజా నియామకాలతో కొంత మేర ఉపశమనం
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన భారతీయ రైల్వే ఏకంగా 89,500 మంది సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టింది. ఇందులో లోకో పైలట్లు, టెక్నీషియన్లు, గ్యాంగ్ మెన్లు, స్విచ్ మెన్లు, ట్రాక్ మెన్లు, క్యాబిన్ మెన్లు, వెల్డర్లు, హెల్పర్లు, పోర్టర్లు ఉన్నారు. హైస్కూల్ విద్యార్హత నుంచి ఇంజనీరింగ్ విద్యార్హతల వరకు వివిధ వర్గాల వారికి ఏకంగా లక్ష ఉద్యోగాలను కల్పించనుంది. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు రానుండడంతో కేంద్రం వ్యూహాత్మకంగా ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టిందంటున్నారు విశ్లేషకులు.

రైల్వేలో సుమారు 1.2 లక్షల ఉద్యోగ ఖాళీలు భద్రతా విభాగంలోనే ఉన్నాయి. ఏటా రైల్వేలో సుమారు 40,000-45,000 మంది రిటైర్ అవుతున్నారని ఓ ఉద్యోగి తెలిపారు. తాజా నియామకాలతో రైల్వేపై ఏటా రూ.4,000 కోట్ల మేర భారం పడుతుందని అంచనా. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ ఉద్యోగుల వేతనాలకు రూ.69,713 కోట్లు ఖర్చు చేయగా, అది 2017-18లో రూ.72,705 కోట్లకు చేరుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ రూ.76,451 కోట్లకు పెరుగుతుందని అంచనా.
railway recruitment

More Telugu News