జుహూ శ్మశానవాటికలో అతిలోకసుందరి అంత్యక్రియలు.. జరుగుతున్న ఏర్పాట్లు

  • మధ్యాహ్నం 3 గంటలకు ముంబై చేరుకోనున్న భౌతికకాయం
  • జుహూ శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
  • శ్రీదేవి నివాసం వద్దకు పోటెత్తుతున్న అభిమానులు
ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమతోపాటు అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. నిన్న రాత్రి ఆమె దుబాయ్ లో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబై చేరుకోనుందని సమాచారం. జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోగానే ఆమె అంత్యక్రియలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు చేరుకుంటున్నారు. తాము ఎంతగానో ఆరాధించిన అతిలోకసుందరిని చివరిసారి చూడాలని ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. 
Go Back to Shorts
sridevi
death
dead body
funerals

More Telugu News