గాజు గ్లాస్‌తో తలపై కొట్టుకుని... వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాజు గ్లాస్‌తో తలపై కొట్టుకుని... వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక చోప్రా

  • ఇటీవల వివాదాల్లో ఇరుక్కున్న ప్రియాంక చోప్రా
  • ఉదయం నైన్ నుంచి వైన్ టైం వ‌రకు వ‌ర్క్ చేస్తే ఇలానే జ‌రుగుతుంది-ప్రియాంక
  • ఇటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయొద్దు
గతంలో హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లోనూ బిజీబిజీగా గడిపిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం క్వాంటికో 3 సీజన్‌తో పాటు ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఆమెను ఇటీవల పలు వివాదాలు చుట్టుముట్టాయి. మోసానికి పాల్పడ్డ నీర‌వ్ మోదీ.. వ‌జ్రాల వ్యాపారానికి ఆమె ప్రచారకర్తగా ఉండడంతో పాటు ఇటీవల అర్ధ న‌గ్నంగా అసోం పర్యాటక శాఖ క్యాలెండర్స్‌పై ఆమె కనపడింది.

అయితే, ప్రియాంక చోప్రా తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. వైన్ గ్లాస్‌లోని మద్యం తాగి అదే గ్లాసుతో త‌ల‌పై గట్టిగా కొట్టుకుంది. దీంతో ఆ గ్లాస్ పగిలిపోయింది. ఉదయం నైన్ నుంచి వైన్ టైం వ‌రకు వ‌ర్క్ చేస్తే ఇలానే జ‌రుగుతుందని ఆమె పేర్కొంది. ఇటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయొద్దని చెప్పింది. తాను కొన్నిసార్లు ఇటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటానని తెలిపింది.   

 
Viral Videos
priyanka
hollywood

More Telugu News