Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అచ్చం ప్రియా వారియర్‌లా పేర‌డీ చేసిన అల్లు అర్జున్‌.. అలరిస్తోన్న వీడియో!

  • 'ఒరు అదార్ లవ్'లోని పాట‌లో న‌టి ప్రియా ప్రకాశ్ నటనను ఇటీవలే మెచ్చుకున్న బన్ని
  • తన కుమారుడితో కలిసి ఆమెలా నటించిన బన్ని
  • అలరిస్తోన్న వీడియో
'ఒరు అదార్ లవ్' సినిమాలోని ఓ పాట‌లో న‌టి ప్రియా ప్రకాశ్ వారియర్ క‌న‌బ‌ర్చిన హావ‌భావాలు బాగా పాప్యులర్ అయిన విష‌యం తెలిసిందే. ఆ పాట‌లో ప్రియా వారియ‌ర్ చేసిన‌ట్లే సినీన‌టుడు అల్లు అర్జున్ చేసి అల‌రించాడు. తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ పేరడీని చేశాడు. తన చూపుడు వేలు, మధ్య వేలుకు ముద్దుపెట్టిన బన్ని, తన కుమారుడికి దాన్ని గురిపెట్టి షూట్ చేశాడు.

బ‌న్ని అలా షూట్ చేయ‌డంతో అయాన్ అంతే తమాషాగా బెడ్‌పై పడిపోయాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్ బన్ని అభిమానులను అలరిస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రియా వారియ‌ర్ ను బ‌న్ని మెచ్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆమెను అనుక‌రిస్తూ బ‌న్ని ఇలా చేయ‌డం అభిమానుల‌ను అల‌రిస్తోంది.    
Allu Arjun
priya varrier
parady

More Telugu News