మంత్రి కామినేని చర్చల ఫలితం.. దీక్ష విరమించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు
- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిరక్షణ కోసం దీక్ష
- డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కామినేని
- రేపటి నుండి విధులకు హాజరు
యూనివర్సిటీ నిధుల సంరక్షణకు ప్రత్యేకంగా జీవో త్వరలో విడుదల, అమరావతిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏర్పాటుకు సీఆర్డీఏ ద్వారా స్థలం కేటాయింపు వంటి అంశాలతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కేటాయించే గ్రాంట్ ను రూ. 6 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంపుదలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. యూనివర్సిటీ అడ్హక్ ఉద్యోగుల జీతాల పెంపుదలపై మంత్రి కామినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. మంత్రి చర్చలమేరకు సంతృప్తి చెందిన ఉద్యోగులు దీక్షను విరమించి రేపటి నుండి విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు.