రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
- 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
- వచ్చేనెల 5న నోటిఫికేషన్
- వచ్చేనెల 23న ఎన్నికలు
- ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
వచ్చేనెల 5న ఇందు కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చేనెల 12 చివరి తేదీ అని ఈసీ పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరిగడువు మార్చి 15 అని తెలిపింది.