శాస్త్రీయ ఆధారాలు లేకుంటే వర్మపై కేసు నిలవదు: సీసీఎస్ వర్గాలు
- గత వారంలో వర్మను విచారించిన పోలీసులు
- కేసును నిలిపే ఆధారాల సేకరణలో సీసీఎస్
- పక్కా ఆధారాలు లేకుంటే ఏమీ చేయలేని స్థితి
- అదే పనిలో ఉన్నామంటున్న పోలీసు వర్గాలు
ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం ఉన్నట్టు ఆధారాల కోసం ల్యాప్ టాప్ ను సీజ్ చేసి విశ్లేషణకు పంపామని, అందులో ఆధారాలు లభిస్తే మాత్రమే ఆయనపై కేసు నిలుస్తుందని సీసీఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాము పక్కాగా ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నామని, అందువల్లే ఆయన నేడు విచారణకు రానవసరం లేదని కబురు చేశామని వెల్లడించాయి.