'మీకు రాజకీయాలెందుకు?'...ఆర్మీ చీఫ్‌కు ఒవైసీ చురక
- ఆర్మీ చీఫ్‌కు రాజకీయాల్లో జోక్యం తగదని చురక
- పార్టీలకు రాజ్యాంగం అనుమతి ఉందని వెల్లడి
- ఆర్మీ చీఫ్ పౌర నాయకత్వం కిందే పనిచేయాలని హితవు
పార్టీలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నుంచి అనుమతి ఉందని, ఆర్మీ చీఫ్ ఎల్లప్పుడూ ఎన్నికైన పౌర నాయకత్వం కిందే పనిచేయాలని ఒవైసీ సూచించారు. అసోంలోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుదలపై వచ్చిన నివేదికల నేపథ్యంలో బిపిన్ బుధవారం మాట్లాడుతూ...1980ల్లో బీజేపీ వృద్ధి కంటే ఏఐయూడీఎఫ్ వేగంగా వృద్ధి చెందిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈశాన్య భారతంలో సరిహద్దుల రక్షణపై ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.