'సైరా' రెండవ షెడ్యూల్ అందుకే మొదలుకాలేదట!
- 'సైరా' తాజా షెడ్యూల్ కి సన్నాహాలు
- బరువు తగ్గుతోన్న చిరంజీవి
- ఈ కారణంగానే ఆలస్యం
ఈ షెడ్యూల్లో నరసింహా రెడ్డి యంగ్ లుక్ తో చిరంజీవి కనిపించనున్నారు. అందుకోసం ఆయన క్లీన్ షేవ్ లో స్లిమ్ గా ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంటుందట. బరువు తగ్గడానికి కసరత్తు చేయడంలో చిరంజీవి నిమగ్నమై ఉన్నారట. ఈ నెల చివరిలో లుక్ ఓకే చేసుకుని, వచ్చేనెలలో రెండవ షెడ్యూల్ ను మొదలుపెడతారని సమాచారం. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.