సినిమా కోసం.. వీధుల్లో అప్పడాలమ్మిన బాలీవుడ్ స్టార్ హీరో!
- 'సూపర్ 30' చిత్రం కోసం డీగ్లామర్‌గా హృతిక్
- కథావస్తువుగా బీహార్ లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ జీవితం
- మరో ప్రయోగాత్మక పాత్ర చేస్తున్న సిక్స్ ప్యాక్ వీరుడు
తన కెరీర్లో మరో ప్రయోగాత్మక పాత్రను చేస్తున్నాడు. కథానుసారం...అతను జైపూర్ వీధుల్లో సైకిల్‌పై అప్పడాలమ్ముతున్నాడు. బీహార్‌కి చెందిన లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం బాలీవుడ్ హీరోలకు కొత్తేమీ కాదు. ఈ విషయంలో అమీర్ ఖాన్‌ను అందరూ ప్రధానంగా చెప్పుకుంటుంటారు. హృతిక్ సైతం ఇప్పుడు ఈ చిత్రం కోసం అప్పడాలమ్ముతూ చాలా సింపుల్‌గా ఆర్డినరీగా కన్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కథావస్తువైన ఆనంద్ కుమార్ పేద కుటుంబాలకు చెందిన దాదాపు 30 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రతి ఏడాది ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.