తమిళనాడులో శామ్ సంగ్ 15 స్మార్ట్ హెల్త్ కేర్ కేంద్రాలు

  • ప్రభుత్వాస్పత్రులకు ఉచితంగా పరికరాలు
  • రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
  • కర్ణాటకలో ఆరోగ్య కేంద్రాలకు ట్యాబ్లెట్లు
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్ సంగ్ తమిళనాడు రాష్ట్రంలో 15 స్మార్ట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సీఎం పళనిస్వామి కోయింబత్తూరులో  వీటిని ప్రారంభించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులకు అల్ట్రాసౌండ్, ఎక్స్ రే మెషిన్లు, ఎల్ఈడీ టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లను కూడా అందించనుంది. ఇందుకు సంబంధించి శామ్ సంగ్ ఇండియా, తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే, కర్ణాటక రాష్ట్రంలో ప్రజారోగ్య కేంద్రాలకు 1,000 ఐరిష్ ట్యాబ్లెట్ మెషిన్లను అందజేసింది. 
Go Back to Shorts
samsung
health care

More Telugu News