ట్విట్టర్ వార్: గిబ్స్ కు ఘాటు సమాధానమిచ్చిన అశ్విన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్ వార్: గిబ్స్ కు ఘాటు సమాధానమిచ్చిన అశ్విన్

  • గిబ్స్, అశ్విన్ ట్విట్టర్ వార్
  • అశ్విన్ వీడియోకి కామెంట్ పెట్టిన గిబ్స్
  • గిబ్స్ కు ఘాటు సమాధానమిచ్చిన అశ్విన్
పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను హడలెత్తించే టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌, దూకుడైన వ్యాఖ్యలకు కూడా పెట్టింది పేరు. తాజాగా అశ్విన్ దెబ్బకు సఫారీ వెటరన్ ఆటగాడు హెర్షెల్ గిబ్స్ అవాక్కయ్యాడు.

 దాని వివరాల్లోకి వెళ్తే... ఈ మధ్య అశ్విన్ తన షూ గురించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందులో ఆ షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెప్పాడు. దీనిపై గిబ్స్ స్పందిస్తూ, ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ వికెట్ల మధ్య, అవుట్‌ ఫీల్డ్‌ లో అశ్విన్‌ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే వ్యంగ్యమైన వ్యాఖ్య పెట్టాడు.

దీనికి వెంటనే సమాధానమిస్తూ ‘ఈ విషయంలో నీ అంత అదృష్టవంతుడిని కాదు కాబట్టి నిజంగానే వేగంగా పరుగెత్తలేను మిత్రమా. అయితే తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం నేను చాలా అదృష్టవంతుడిని’ అంటూ గిబ్స్‌ ఊహించని సమాధానం ఇచ్చాడు అశ్విన్.

దీంతో షాక్ తిన్న గిబ్స్ తన జోక్ ని అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడని, దీనిని ఇంతటితో వదిలేస్తున్నానని మరో ట్వీట్ చేశాడు. దానికి తాను కూడా జోక్ చేశానని, మున్ముందు కలిసి డిన్నర్ చేద్దామని అశ్విన్ సూచించాడు. కాగా, గిబ్స్ 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో దోషిగా తేలడంతో ఆరు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 
Ravichandran Ashwin
hershel gibs
Twitter

More Telugu News