మీడియాలో వస్తున్న వార్తలపై తీవ్రంగా మండిపడుతున్న రాంగోపాల్ వర్మ!
- శనివారం నాడు సీసీఎస్ పోలీసుల విచారణకు వర్మ హాజరు
- ఆపై మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం
- 'జీఎస్టీ'ని తెరకెక్కించిన ఘనత తనదేనన్న వర్మ
తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు. సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశాడు వర్మ. కాగా, 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ) సినిమాపైన, ఆపై మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలపైన గత శనివారం వర్మను సీసీఎస్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.