india: తొలి టీ 20: దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 204 పరుగులు

షార్ట్స్‌లో చూడండి
 జొహెన్స్ బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి టీ 20లో దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 204 పరుగులుగా టీమిండియా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రెచ్చిపోయిన శిఖర్ ధావన్ 72 పరుగులు చేశాడు. అందులో పది ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. కాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు రీజా హెన్ డ్రిక్, జేజే స్మట్స్ క్రీజ్ లో ఉన్నారు.

భారత్ బ్యాటింగ్ : ఆర్జీ శర్మ (21), శిఖర్ ధావన్ (72), రైనా (15), కోహ్లీ (26), ధోనీ (16), పాండే 29, పాండ్యా 13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

దక్షిణాఫ్రికా బౌలింగ్ : సీజే డాల -2, సీహెచ్ మోరిస్ - 1,టి.షమ్సి -1, ఫెహ్లకోహియో - 1
Go Back to Shorts
india
south africa

More Telugu News