Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్ లో స్నేహితుడిని పట్టుకున్నారని... పోలీసులపై హిజ్రా బూతుపురాణం!

  • హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్
  • రాయలేని పదజాలంతో బూతులు తిట్టిన హిజ్రా
  • చిత్రీకరిస్తున్న మీడియాపైనా దాడి
  • మొత్తం 43 మంది మందుబాబులపై కేసులు
శనివారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, ఓ హిజ్రా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వచ్చిన హిజ్రా, తన స్నేహితుడు మద్యం తనిఖీల్లో 168 పాయింట్లతో దొరికిపోవడంతో పోలీసులపై చిందులేసింది. రాయడానికి వీల్లేని పదజాలాన్ని ఉపయోగిస్తూ, బూతులు తిట్టింది. తనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి చేసింది. "మమ్మల్ని స్పెషల్ గా తీయడం ఏందిరా?...." అంటూ రెచ్చిపోయింది.

మరోపక్క, మందు కొట్టి కారు నడుపుతూ వస్తున్న మరో యువతి తనిఖీలకు చిక్కకుండా ఉండేందుకు రోడ్డుపై పరుగులు పెట్టింది. వీరిని అదుపు చేసిన పోలీసులు, వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 20 ద్విచక్ర వాహనాలు, 23 కార్లు పట్టుబడ్డాయని, మొత్తం 43 మందిపై కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. వీరికి సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు.
Hyderabad
Jublee Hills
Drunken Drive
Hizra

More Telugu News