రామ్ గోపాల్ వర్మ మొబైల్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన పోలీసులు.. వచ్చే శుక్రవారం మళ్లీ రావాలంటూ ఆదేశం!
- ముగిసిన సీసీఎస్ పోలీసుల విచారణ
- 3 గంటల 20 నిమిషాల పాటు ప్రశ్నల పరంపర
- 24 ప్రశ్నలకు వివరణ కోరిన పోలీసులు
ఈ రోజు విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. వచ్చే శుక్రవారం కూడా మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. వర్మకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటివారితో సంబంధాలు ఉన్నాయి? తదితర అంశాలకు సంబంధించిన వివరాలు వీటిలో లభించే అవకాశం ఉన్నందున... పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.