Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నానితో హ్యాట్రిక్ మూవీ చేయనున్న దిల్ రాజు

  • నానిని ఒప్పించిన విక్రమ్ కుమార్ 
  • నానిని మెప్పించిన హను రాఘవపూడి 
  • ఈ రెండు సినిమాల్లో ఒకదానికి నిర్మాతగా దిల్ రాజు
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోన్న నాని, ఆ తరువాత సినిమాను శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మల్టీ స్టారర్ లో నాగార్జునతో కలిసి నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా తరువాత నానితో మూడవ సినిమా చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. గతంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన 'నేను లోకల్' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలు విజయాలను సాధించాయి. అందువలన హ్యాట్రిక్ మూవీ చేయాలనే ప్రయత్నాలలో దిల్ రాజు వున్నట్టుగా తెలుస్తోంది. ఒక వైపున విక్రమ్ కుమార్ .. మరో వైపున హను రాఘవపూడి .. నాని కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో దిల్ రాజు ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

nani
dil raju

More Telugu News