చంద్రబాబు విషయంలో బీజేపీకి ఈ భయం ఉండవచ్చు: జేసీ
- దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర చంద్రబాబుది
- మళ్లీ అలాంటిది జరగవచ్చనే భయం బీజేపీలో ఉండవచ్చు
- టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాలతో ఒరిగేదేమీ ఉండదు
ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని జేసీ స్పష్టం చేశారు. జగన్ తన ఎంపీలతో ఏప్రిల్ లో రాజీనామాలు చేయించినంత మాత్రాన ఆయా స్థానాలకు ఉపఎన్నికలు జరగవని... తక్షణమే రాజీనామాలు చేయిస్తే ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని... వీళ్ల స్థానంలో బీజేపీ వాళ్లకు కేంద్ర మంత్రులుగా మోదీ అవకాశం కల్పిస్తారని తెలిపారు.