హీరోయిన్లు సహకరించడం లేదు... తోక కత్తిరిస్తాం: 'మా' అధ్యక్షుడు శివాజీరాజా సంచలన కామెంట్స్ వీడియో
- కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న హీరోయిన్లు
- బతిమాలినా 'మా' కార్యక్రమాలకు రావడం లేదు
- నిర్దాక్షిణ్యంగా తోకలు కత్తిరిస్తాం
- 'మా' అధ్యక్షుడు శివాజీ హెచ్చరిక
నిర్మాతలు ఇచ్చిన ఏవైనా చెక్కులు బౌన్స్ అయితేనే సభ్యత్వం కోసం తమ వద్దకు పరిగెత్తుకుని వస్తున్నారని ఆయన ఆరోపించారు. హీరోయిన్లు తోకలు జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తామని హెచ్చరించారు. మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇచ్చేంత డబ్బు ఇవ్వలేకపోయినా, తాము కూడా ఎంతో కొంత ఇస్తామని 'మా' కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. శివాజీ వ్యాఖ్యలకు నటుడు నరేష్ కూడా మద్దతు తెలిపారు. హీరోయిన్లు తప్పనిసరిగా 'మా' సభ్యత్వం తీసుకోవాల్సిందేనని, వారంతా టాలీవుడ్ కార్యక్రమాల్లో పాల్గొనకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు.