రాజకీయాలు నాకు పడవు.. తేల్చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్
- పాలకొల్లులో రాజేంద్రుడికి ఘన సత్కారం
- 40 ఏళ్ల సినీ జీవితంలో అందరినీ నవ్వించడమే తెలుసు
- చివరి వరకు అదే చేస్తా
రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి రానున్నట్టు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. పలానా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల సినీ నటులు వరుస పెట్టి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఈ వార్తకు కూడా ప్రాధాన్యం లభించింది. దీంతో స్పందించిన నట కిరీటి తనకు అటువంటి ఉద్దేశం లేదని, ఆరోగ్యం సహకరించినంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని వివరించారు.