నాలుగో వన్డే: ధాటిగా ఆడుతోన్న శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ

  • 100 మార్కు దాటిన టీమిండియా స్కోరు
  • క్రీజులో ధావన్ (58), కోహ్లీ (36)
  • రోహిత్ శర్మ (5) ఔట్
  • ప్రస్తుత స్కోరు 105/1 (19 ఓవర్లకి)
జోహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. 13 బంతుల్లో 5 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. రబాడ బౌలింగ్‌లో పెవిలియన్ చేరి మరోసారి నిరాశపర్చాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతూ 53 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 58, కెప్టెన్ విరాట్ కోహ్లీ 36 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 105 (19 ఓవర్లకి) గా ఉంది. ఇప్పటికే వరుసగా మూడు వన్డేలు ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలోనూ ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది.  
Go Back to Shorts
Cricket
Virat Kohli
India
south africa

More Telugu News