పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం.. నిర్మాణంలోకి అడుగుపెట్టిన నవయుగ!
- స్పిల్ వే కాంక్రీట్ పనులు ప్రారంభం
- రూ. 1244 కోట్ల పనులు నవయుగ సంస్థకు అప్పగింత
- 2015-16 ధరల ప్రకారమే పనులు చేపడుతున్న నవయుగ
ఇప్పటి వరకు స్పిల్ వే పనులను త్రివేణి కంపెనీ చేపట్టిందని, ఇకపై వాటిని నవయుగ చేపడుతుందని తెలిపారు. త్వరలోనే కార్మికుల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు. కాగా, దాదాపు రూ. 1244 కోట్ల విలువైన పనులను నవయుగకు అప్పజెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2015-16 ధరల ప్రకారమే ఈ పనులను చేపట్టేందుకు నవయుగ ముందుకు వచ్చింది.