Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకీకి 'ఛలో' హిట్ భారీ ఛాన్స్ తెచ్చిపెట్టేసింది!

  • 'ఛలో' తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
  •  పెద్ద బ్యానర్ నుంచి పిలుపు 
  • స్టార్ హీరో .. హీరోయిన్స్ తో చేసే అవకాశం
నాగశౌర్య .. రష్మిక మందన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'ఛలో' సినిమా తెరకెక్కింది. యాక్షన్ కామెడీతో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది .. భారీ వసూళ్లతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడిగా ఈ సినిమా వెంకీ కుడుములకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

దాంతో ఆయనతో ఓ సినిమా చేయడానికి హారిక అండ్ హాసిని బ్యానర్ వారు ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వెంకీ కుడుముల వినిపించిన లైన్ నచ్చడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో ఆయన వున్నాడని అంటున్నారు. స్టార్ హీరో .. హీరోయిన్స్ తో ఈ సినిమా వుండనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ బ్యానర్ వెంకీ కుడుముల ప్రాజెక్టుపై దృష్టి పెట్టనుంది.  
venky kudumula

More Telugu News