అమితాబ్ బచ్చన్‌కు స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- మెడ, వెన్ను నొప్పితో బాధపడుతున్న అమితాబ్
- ఆసుపత్రిలో చేరిన కాసేపటికే డిశ్చార్జ్
- సమస్య లేదన్న వైద్యులు
అమితాబ్ జీర్ణాశయంతర (గ్యాస్ట్రోఇంటెస్టినల్) సమస్యతో పాటు, మెడ, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. కాగా, అమితాబ్ ప్రస్తుతం ‘102 నాటౌట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రిషి కపూర్ కూడా నటిస్తున్న ఈ సినిమాకు ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. మేలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం ట్విట్టర్లో విడుదల చేశారు.