అమితాబ్ బచ్చన్‌కు స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

  • మెడ, వెన్ను నొప్పితో బాధపడుతున్న అమితాబ్
  • ఆసుపత్రిలో చేరిన కాసేపటికే డిశ్చార్జ్
  • సమస్య లేదన్న వైద్యులు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75) శుక్రవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఉండడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. ‘‘లుంబార్ (నడుము కింది భాగం) ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చిన అనంతరం డిశ్చార్జ్ చేశాం’’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అమితాబ్ జీర్ణాశయంతర (గ్యాస్ట్రోఇంటెస్టినల్) సమస్యతో పాటు, మెడ, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. కాగా, అమితాబ్ ప్రస్తుతం ‘102 నాటౌట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రిషి కపూర్ కూడా నటిస్తున్న ఈ సినిమాకు ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. మేలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం ట్విట్టర్‌లో విడుదల చేశారు.
Go Back to Shorts
Amitabh Bachchan
Hospital
Mumbai
Actor
Bollywood

More Telugu News