'భారత్' చిత్రంలో సల్మాన్ ఖాన్ 'పంచావతారం'!
- ఐదు పాత్రల్లో ఫ్యాన్స్‌కు కండలవీరుడి పండగ
- సుల్తాన్ దర్శకుడు అబ్బాస్ జాఫర్‌తో మరోసారి జోడీ
- అరవై ఏళ్ల భారత చరిత్రపై సినిమా రూపకల్పన
- ఇండో-పాక్ సరిహద్దు కోసం అబూదాబీలో ఎడారి సీన్
కథ డిమాండ్ మేరకు పంజాబ్, ముంబై, ఢిల్లీ, స్పెయిన్, అబూదాబీలోని పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరపనున్నట్లు సమాచారమ్. ఈ చిత్రంలో గత 60 ఏళ్ల చరిత్రను చూపించనున్నారట. అందువల్ల చారిత్రక సంఘటనల కోసం ప్రత్యేక సెట్లను కూడా వేయనున్నారని తెలిసింది. దక్షిణకొరియా డ్రామా 'ఓడ్ టు మై ఫాధర్'కి ఈ సినిమా అధికారిక రీమేక్.
ఇందులో ఇండో-పాక్ సరిహద్దు కోసం అబూదాబీలో ఒక ఎడారిని ఏర్పాటు చేయనున్నారట. ఇరవై ఏళ్ల వ్యక్తి పాత్రను కూడా సల్మాన్ పోషించనున్నాడట. దానికి తగ్గట్టుగా కనిపించడం కోసం ఈ సూపర్ స్టార్ ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాడు. మొత్తానికి ఐదు పాత్రలతో ఫ్యాన్స్‌కు సల్మాన్ విందు భోజనం వడ్డించనున్నాడన్నమాట.