ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అంశంపై లోక్సభలో ప్రకటన చేసిన అరుణ్ జైట్లీ
- ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించాం, వాటికి నిధులు ఇస్తున్నాం
- ఏపీ రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చాం
- కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిన్నటి నుంచి చర్చలు జరుపుతున్నారు
- రైల్వే జోన్ కు సంబంధించి కొన్ని విషయాలు తేలాల్సి ఉంది
ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించామని వాటికి నిధులు ఇస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే పోలవరానికి పలుసార్లు నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిన్నటి నుంచి చర్చలు కూడా జరుపుతున్నారని అన్నారు. రైల్వే జోన్ కు సంబంధించి కొన్ని విషయాలు తేలాల్సి ఉందని అన్నారు.
రెవెన్యూ లోటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఏపీకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని అరుణ్ జైట్లీ చెప్పారు. అప్పట్లో తాము రాష్ట్ర విభజనకు మద్దతిచ్చినప్పటికీ, ఏపీకి హక్కుల కోసం కూడా అప్పట్లో పోరాడామని చెప్పారు. అదే సమయంలో లోక్సభలో మరింత గందరగోళం చెలరేగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.