రేపటి బంద్‌కు జనసేన మద్దతు.. జన సైనికులు పాల్గొనండి: పవన్ కల్యాణ్ పిలుపు

బ‌డ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి జ‌రిగిన‌ అన్యాయంపై నిర‌స‌న తెలుపుతూ ప్ర‌తిప‌క్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు తన పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

'శాంతియుతంగా పాల్గొనండి.. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా వివిధ రాజకీయ పక్షాలు గురువారం తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్ కు జనసేన తన మద్దతు తెలుపుతోంది. రాష్ట్ర ప్రజల అసంతృప్తి, ఆవేదనను ప్రభుత్వాలకు తెలపడానికి ఉద్దేశించిన ఈ బంద్ లో ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో, శాంతియుతంగా జన సైనికులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను-జైహింద్' అని పవన్ పేర్కొన్నారు. 


More Telugu News