ఆ వార్తల్లో నిజం లేదు.. ఉగ్రవాదులకు చిక్కకుండా తనను తాను పేల్చేసుకున్న పైలట్!
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
- ఉగ్రవాదులతో చివరి వరకు పోరాడాడన్న రష్యా
- మరణానంతం ‘హీరో ఆఫ్ ది రష్యా’ అవార్డు
యుద్ధ విమానాన్ని సిరియా తిరుగుబాటు దళాలు నేలకూల్చినట్టు రష్యా పేర్కొంది. పోర్టబుల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్తో విమానాన్ని కూల్చినట్టు తెలుస్తోందని రష్యన్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులతో పోరాడి పైలట్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నాయి. ముష్కరులతో చివరి వరకు పోరాడిన పైలట్ వారికి చిక్కకుండా తనను తాను పేల్చుకున్నట్టు వివరించాయి. పైలట్ ఫిల్ఫ్వోకు ‘ది హీరో ఆఫ్ ది రష్యా’ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.