కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు!
- మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో ఘటన
- మృతులు రమేశ్, మానస, మనశ్రీ (2), గీతశ్రీ (1) గా గుర్తింపు
- ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వారుగా సమాచారం
తమ పిల్లలతో కలిసి కీసర పెద్దమ్మ చెరువులోకి దూకి సదరు దంపతులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. వీరి ఆత్మహత్యలకు కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. వీరు ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.