Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అజిత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నయనతార

  • అజిత్ హీరోగా 'విశ్వాసం' 
  • దర్శకుడు శివతో మరోసారి 
  • నయనతార పాత్రకి ప్రాధాన్యత
కోలీవుడ్ అగ్ర కథానాయకులలో అజిత్ ఒకరు. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను అజిత్ కి మంచి క్రేజ్ వుంది. వరుస హిట్లతో ఆయన దూసుకుపోతున్నాడు. ఇక అక్కడ లేడీ సూపర్ స్టార్ గా నయనతార తన సత్తాను చూపుతోంది. అజిత్ తో దర్శకుడు శివ చేయనున్న 'విశ్వాసం' సినిమా కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

ఈ సినిమా చేయడానికి నయనతార అంగీకరించిందనేది తాజా సమాచారం. గతంలో అజిత్ తో కలిసి నయనతార నటించింది. అయితే ఆమె స్టార్ డమ్ పెరిగిన తరువాత అజిత్ కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అజిత్ కాంబినేషన్ అనే కాదు .. తన పాత్ర కూడా బాగుండటంతోనే ఆమె డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి. 
ajith
nayanatara

More Telugu News