Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సైరా' కాస్ట్యూమ్స్ కోసం భారీ స్థాయిలో ఒక షాప్ పెట్టేశారు!

  • 'సైరా' కోసం భారీ సెట్టింగ్స్ 
  • కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ 
  • కాస్ట్యూమ్స్ ఉంచేందుకు ఎకరం స్థలం
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలో రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇది చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతూ ఉండటం వలన, భారీ సెట్టింగ్స్ తో పాటు కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అందువలన 'సైరా' సినిమా కోసం భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్ ను సిద్ధం చేస్తున్నారు.

'పద్మావత్' కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన చంద్రకాంత్ సొనావెన్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ వర్క్ లో భాగం అవుతోంది.  అన్నపూర్ణ స్టూడియో పరిథిలోని ఎకరం స్థలంలో భారీ షాప్ ను ఏర్పాటు చేసి .. అందులో ఈ కాస్ట్యూమ్స్ అన్నిటినీ వుంచుతున్నారట. ప్రతి రోజు కూడా ఆ రోజున ప్లాన్ చేసిన సన్నివేశాలను బట్టీ .. పాత్రధారులను బట్టి కాస్ట్యూమ్స్ ను సెట్ చేస్తారట.   
chiranjeevi
nayanatara

More Telugu News