హాంకాంగ్ లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు... 4 వేల మందిని కాపాడామన్న అధికారులు!
- రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ అధీనంలో హాంకాంగ్
- అప్పట్లో బాంబులు కురిపించిన అమెరికా
- పేలకుండా ఉండిపోయిన 1000 పౌండ్ల బాంబు
- నిర్వీర్యం చేసిన హాంకాంగ్ పోలీసులు
దీంతో యాంటీ బాంబ్ స్క్వాడ్, పోలీసులు జాగ్రత్తగా దాన్ని వెలికితీసి నిర్వీర్యం చేశారు. గడచిన వారం రోజుల వ్యవధిలో హాంకాంగ్ లో బయటపడిన రెండో బాంబు ఇది. ఇక ఇది పేలివుంటే ఈ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది వరకూ మరణించి వుండేవారని అధికారులు తెలిపారు. ఈ బాంబు లభ్యమైన ప్రాంతం సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్ అధీనంలో ఉన్నదని, ఆ సమయంలోనే అమెరికా ఈ బాంబును జారవిడిచి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తరువాత, బాంబును నిర్వీర్యం చేశామని వెల్లడించారు.