ట్రైన్ లో వేధింపులకు దిగిన పోకిరిని అరెస్టు చేయించిన 'జీనియస్' హీరోయిన్!
- తమిళనాడు నుంచి ట్రైన్ లో కేరళ వెళ్తున్న నటి సనూష
- వేధింపులకు దిగిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేయించిన వైనం
- నిందితుడ్ని నిలదీసినప్పుడు సపోర్ట్ రాలేదని ఆవేదన
వెంటనే అతని చేయిపట్టుకుని లైట్స్ ఆన్ చేసి ట్రైన్ లో ఎస్కార్ట్ పోలీసులకు అప్పగించాను. అయితే నాతో అతను అసభ్యకరంగా ప్రవర్తించిన దాని కంటే కూడా పక్కనున్న మరో ఇద్దరు ఏమాత్రం రియాక్ట్ కాకపోవడం చాలా ఆందోళనకు గురిచేసింది. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లే వరకు నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఇప్పుడు నేను చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుందని తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం పూర్తి మద్దతునిచ్చినందుకు సంతోషిస్తున్నాను.
ఈ సందర్భంగా నేను మహిళలకు, అమ్మాయిలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇటువంటి విషయాలు ఏవైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయవద్దు" అని తెలిపింది. బాలనటిగా సుమారు 40 సినిమాల్లో నటించిన సనూష, పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.