రాహుల్ జాకెట్ వివాదం: రేణుకా చౌదరికి రూ.700 పంపిన బీజేపీ నేత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ జాకెట్ వివాదం: రేణుకా చౌదరికి రూ.700 పంపిన బీజేపీ నేత!

  • రాహుల్ జాకెట్ అంత ఖరీదైనది కాదన్న కాంగ్రెస్ నేత
  • రూ.700 ఇస్తే తానే తీసుకొస్తానన్న రేణుక
  • ఆ మొత్తాన్ని పేటీఎం ద్వారా పంపిన తేజీందర్ బగ్గా
  • అలాంటి జాకెట్ పట్టుకురమ్మంటూ రేణుకకు ట్వీట్
మేఘాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సమావేశానికి ఖరీదైన జాకెట్ తో రాహుల్ గాంధీ హాజరైన విషయం తెలిసిందే. ఇంత ఖరీదైన జాకెట్ ను రాహుల్ ధరించడంపై బీజేపీ విమర్శలు గుప్పించడమూ, ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వెనకేసుకురావడం విదితమే. రాహుల్ కు మద్దతు పలికే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత తేజీందర్ బగ్గా స్పందించారు.

రాహుల్ ధరించిన జాకెట్ ఖరీదు డెబ్భై వేలు ఎందుకు ఉంటుందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఆమె, రూ.700 ఇస్తే అలాంటి జాకెట్ ను తానే తీసుకొస్తానని చమత్కరించారు. ఈ చమత్కారాన్ని సీరియస్ గా తీసుకున్న తేజీందర్ బగ్గా రూ.700ను రేణుకా చౌదరికి పేటీఎం ద్వారా పంపి, రాహుల్ ధరించిన జాకెట్ లాంటిది తనకు కూడా కావాలంటూ నిన్న ఆమెకు ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై దేశ రాజధానిలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఇప్పుడు రాహుల్ ధరించిన జాకెట్ లాంటిదే ఆమె కొనుగోలు చేస్తారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ప్రముఖ బ్రిటిష్ బ్రాండ్ ‘బర్ బెర్రీ’ తయారు చేసిన ఖరీదైన జాకెట్ ను రాహుల్  ఇటీవల ధరించారు. దీని ఖరీదు దాదాపు రూ.63,000 అని సమాచారం.
Rahul Gandhi
renuka chowdary
Congress
bjp

More Telugu News