ఏడాదికి రూ.5 లక్షల వైద్య బీమా... దేశంలో 50 కోట్ల మందికి కేంద్రం బహుమానం
- ఒక్కో కుటుంబానికి అందించే కవరేజీ
- మొత్తం 10 కోట్ల కుటుంబాలకు కేంద్ర సాయం
- బడ్జెట్ లో ప్రకటించిన అరుణ్ జైట్లీ
అంటే ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే 50 కోట్ల మందికి ప్రభుత్వపరంగా ఆరోగ్య రక్షణ లభించనుంది. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని ఓ కుటుంబానికి అందించనున్నట్టు అరుణ్ జైట్లీ చెప్పారు. ఆస్పత్రిలో చేరిన వారికి ఈ స్థాయిలో ప్రయోజనం అందించడమన్నది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.